కిశోరి వికాసం పై అవగాహన కార్యక్రమం

NLR: కోవూరు మండలంలోని మోడే గుంట పంచాయతీ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం కిశోరి వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్‌వైజర్ ప్రమీల మాట్లాడుతూ.. ఆడపిల్లకు 18 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం చేయాలన్నారు. బాల్యవివాహాల వలన కలిగే నష్టాలను స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.