ఇలా చేస్తే.. ప్రభుత్వాసుపత్రి ప్రతిష్ఠ దిగజారదా.?

ఇలా చేస్తే.. ప్రభుత్వాసుపత్రి ప్రతిష్ఠ దిగజారదా.?

GNTR: గుంటూరు ప్రభుత్వాసుపత్రి దినదినాభివృద్ధి చెందుతున్నా.. ప్రతిష్ఠ మాత్రం దిగజారుతోంది. వాహనదారులతో పార్కింగ్ సిబ్బంది గొడవలు, వార్డుల్లో హద్దుల్లేని సెక్యూరిటీ సిబ్బంది దురుసు ప్రవర్తన ఇక్కడ నిత్యకృత్యమైంది. వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం రోగులు, వారి సహాయకులకు శాపంగా మారుతోంది. ఒకే స్ట్రెచర్, మంచంపై ఇద్దరిద్దరికి సేవలు అందించడం కనిపిస్తుంది.