అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలి: కలెక్టర్

అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలి: కలెక్టర్

ADB: రెండు పడక గదుల ఇళ్లను ఈ నెల చివరిలోపు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. త్రాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.