కన్నుల పండుగగా దేవరకోట రథోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం జరిగిన రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో దేవతామూర్తుల విగ్రహాలను పూలమాలలతో అందంగా తీర్చిదిద్దారు. మహిళల మంగళహారతులు, బాజా భజంత్రీల నడుమ పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు.