పంట కాలువ లోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి

పంట కాలువ లోకి దూసుకెళ్లిన కారు.. యువకుడు మృతి

కోనసీమ: రాజోలు మండలం కడలి గ్రామంలో శనివారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ములికిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు.