నేటి నుంచి బాలోత్సవం
KMM: నగరంలోని మంచికంటి ఫంక్షన్ హాల్లో నగర బాలోత్సవం కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం జనరల్ మేనేజర్, బాలోత్సవం కన్వీనర్ వై.శ్రీనివాసరావు, తుమ్మల వెంకట్రావు ముందుగా జాతీయ జెండా, బాలోత్సవం జెండాను ఆవిష్కరించారు. నేటి నుంచి 3 రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. నిర్వాహక బృందం అధిక కృషి చేశారని తెలిపారు.