విమర్శలు మాని రైతులను ఆదుకోండి: ఎమ్మెల్యే

ADB: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అతలాకుతలం అయ్యింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో భారీగా పంటనష్టం జరిగింది. నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదివారం పరిశీలించారు. వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం రాజకీయ విమర్శలు మాని రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని సూచించారు.