సీఎం సహాయం నిధి చెక్కును అందించిన తాతయ్య
ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన యలగాల వెంకట నరసమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తన సిఫార్సులేఖతో రూ. 2,00,000 సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. ఈరోజు ఎమ్మెల్యే బాధిత కుటుంబ సభ్యులకు L.O.Cను అందజేశారు. ఈ కార్యక్రమంలో పింగళ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.