HIT TV కథనానికి స్పందించిన అధికారులు
NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లిలో గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసినా జెండా దిమ్మలు, శిలాఫలకాలకు వేసిన ముసుగులు ఇంకా తొలగించరా అనే కథనం HIT TV యాప్‌లో ప్రచురితమైంది. ఈ కథనానికి అధికారులు స్పందించారు. గ్రామంలోని జెండా దిమ్మలు, శిలాఫలకాలకు వేసిన ముసుగులను అధికారులు తొలగించారు. ముసుగుల తొలగింపునకు కృషిచేసిన హిట్ టీవీకి గ్రామస్తులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.