వైభవంగా ఎల్లమాంబ సిరిమానోత్సవం

వైభవంగా ఎల్లమాంబ సిరిమానోత్సవం

VZM: గంట్యాడ ఎల్లమాంబ సిరిమానోత్సవం శుక్రవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు మేళతాళాలు నడుమ ఆలయ పూజారి కొండబాబు ఐదు గంటలకు సిరిమాను అధిరోహించారు. అమ్మవారి శతకం పుట్ట నుంచి ప్రధాన వీధి మీదుగా అమ్మవారి ఆలయం వరకు మూడుసార్లు సిరిమాను రథం తిరిగింది. వేలాదిగా భక్తులు ఉత్సవాన్ని తిలకించారు.