రేపు మాఘ పౌర్ణమి వేడుకలు
VSP: ఇసుకకొండపై వేంచేసియున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తెరచి ధ్వజస్తంభం పూజలు నిర్వహిస్తారు. భక్తులకు ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు.