కొబ్బరి రైతులకు కలిసిరాని కార్తీక మాసం
కోనసీమ: దసరా పండుగల నేపథ్యంలో పరుగులు పెట్టిన కొబ్బరి ధరలు గత కొన్ని రోజులుగా తగ్గడం రైతులను నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం పచ్చి కొబ్బరి ధర రూ. 22 వేలు (1,000 కాయలు) నుంచి రూ. 23 వేలు పలుకుతోంది. మొన్నటి వరకు రూ.27 వేలు నుంచి రూ.28 వేలకు కొన్నారు. కురిడి కొబ్బరి ప్రస్తుతం రూ.26 వేలు నుంచి రూ.27 వేలుకు కొంటున్నారు. డిమాండ్ తగ్గడంతో ధర తగ్గినట్లు రైతులు తెలిపారు.