సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
MHBD: పెద్దవంగర మండల కేంద్రంలో 33/11 KV నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఇవాళ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భూమి చేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. విద్యుత్ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ఆధునీకరణ కార్యక్రమాలు రాష్ట్ర పురోగతికి బాటలు వేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.