సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంఈవో

KMM: మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో పలువురు దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన వాగ్దేవి సరస్వతి దేవి విగ్రహాన్ని గురువారం పాఠశాలలో తల్లిదండ్రులు లేని పిల్లల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.