చెట్టు పడి పశువుల ఆసుపత్రి ధ్వంసం

చెట్టు పడి పశువుల ఆసుపత్రి ధ్వంసం

ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పశువుల ఆసుపత్రి ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అతి భారీ గాలి వర్షానికి పశువుల ఆసుపత్రి పై ఒక వృక్షం పడిపోవడంతో పాక్షికంగా దెబ్బతిన్నది. ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి ఆసుపత్రిని పునఃనిర్మించాలని కోరుతున్నారు.