గూగుల్ మ్యాప్‌తో డబ్బులు కాజేసిన దుండగుడు

గూగుల్ మ్యాప్‌తో డబ్బులు కాజేసిన దుండగుడు

WGL: రాయపర్తి మండలం మైలారంకి చెందిన ఓ వ్యక్తికి వాట్సప్ ద్వారా ఈనెల 19న ఓ దుండగుడు మెసేజ్ చేశాడు. అందులో గూగుల్ మ్యాప్ రివ్యూటాస్క్‌ను ఇచ్చి డబ్బులు క్రెడిట్ చేస్తానని చెప్పి ముందుగా రూ.180 వేశాడు. నమ్మిన హరీశ్ టాస్కులను చేస్తూ కొంత అమౌంట్ వేస్తూవచ్చాడు. అలా రూ.43,000 వరకు అగంతకుడికి డబ్బులు పంపించాడు. మోసం చేశాడు అని గ్రహించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసాడు.