చెట్ల ముకుందాపురంలో సంపూర్ణ మద్యపాన నిషేధం
SRPT: పెనపహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామ పంచాయితీ పాలకవర్గం సర్పంచ్ పి. సురేందర్ ఆధ్వర్యంలో గ్రామాన్ని "సంపూర్ణ మద్యపాన నిషేధిత గ్రామంగా" ఇవ్వాళ తీర్మానించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి నాటుసారా, బెల్టు షాపులపై పూర్తి నిషేధం అమలులోకి రానుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, గ్రామ ప్రజలందరూ సహకరించాలని పంచాయితీ కోరింది.