రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ఎంపికైన పొద్దుటూరు విద్యార్థి
KDP: జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవం భాగంగా రాష్ట్రస్థాయిలో ఈనెల 16న జరిగే క్విజ్ పోటీలకు రామేశ్వరం మున్సిపల్ హై స్కూల్ విద్యార్థి ప్రణీత్ రెడ్డి ఎంపికయ్యారు. నిన్న కడప సైన్స్ సెంటర్లో జరిగిన క్విజ్ పోటీలలో అధిక మార్కులు సాధించారు. ఈ విద్యార్థికి కడక డిప్యూటీ డిఈవో సర్టిఫికెట్ అందజేశారు, పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.