విశాఖ బీచ్ క్లీనింగ్‌లో పాల్గొన్న జూనియర్ ఆర్టిస్టులు
విశాఖ ఆర్‌కే బీచ్‌లో ఆదివారం తెలుగు సినిమా, డిజిటల్ వెబ్ జూనియర్ ఆర్టిస్టుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా బండారు ఈశ్వర్ ప్రసాద్, గౌరవ అతిథిగా నటుడు రవితేజ పాల్గొన్నారు. బీచ్‌లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించిన తర్వాత, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి నార సంచులు ఉపయోగించాలని ప్రజలకు సూచించారు.