'పీఈటీపై చర్యలు తీసుకోవాలి'

NLG: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల పీఈటీ విద్యార్థినులను, వారి తల్లులను ఇబ్బంది పెడుతున్నాడని కాంగ్రెస్ యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు మనిమద్దె పరమేష్ రాజ్ అన్నారు. స్కూలుకు సెలవులు వచ్చిన, విద్యార్థులు జ్వరంతో స్కూలుకు వెళ్లకున్నా పీఈటీ సంతకం ఉండాలని రూల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ తల్లులను శారీరకంగా లోబరుచుకుంటున్నాడని ఆరోపించారు.