'మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయాలి'

'మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేయాలి'

GNTR: ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న, శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఐటీయూ నేత రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం వరగానిలో ఆయన మాట్లాడారు. దళారులకు అమ్మి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూయజమాని సంతకం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు, పరిహారం ఇవ్వాలని కోరారు. అనంతరం కౌలు రైతు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు.