ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం మండలం సూర్యనారాయణపురం గ్రామంలో ''ఇంటింటికి తెలుగుదేశం'' కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదికాలంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయనతోపాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.