అయినాడలో మూడు పురిల్లు దగ్ధం
VSP: పద్మనాభం మండలం అయినాడ గ్రామంలో గొడ్డు అప్పన్న, గొడ్డు కృష్ణమ్మ, చుక్క కుమారికి చెందిన మూడు పురిల్లు దగ్ధమైయ్యాయని ఆర్‌ఐ శ్యామల తెలిపారు. ఈ ఘటనలో ఇళ్లు కట్టుకునేందుకు ప్రవేట్ బ్యాంకు నుంచి అప్పన్న రూ.3 లక్షలు, కృష్ణమ్మ రూ.2 లక్షలు తీసుకున్న లోన్ డబ్బులు కాలిపోయాయన్నారు. రూ.5 లక్షలతో పాటు ఒక్కక్క ఇంటికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.8 లక్షల ఆస్తి నష్టం జరిగిందన్నారు.