శబరిమలలో మహిళ మృతి.. హైకోర్టు ఆగ్రహం
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో ఉన్న ఓ భక్తురాలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి మరణించింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మహిళ మృతి నేపథ్యంలో శబరిమల ఏర్పాట్లపై కేరళ హైకోర్టు మండిపడింది. రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.