VIDEO: పోచమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన విశ్వబ్రాహ్మణులు

WGL: శ్రావణమాసం మొదలు కావడంతో బోనాల పండగ సందడి మొదలైంది. ఆదివారం వర్ధన్నపేట పట్టణంలోని పోచమ్మ తల్లికి తొలి బోనం విశ్వబ్రాహ్మణ కులస్తులు, కుటుంబ సభ్యులతో ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. పాడిపంట సమృద్ధిగా రావాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి, కుటుంబ సభ్యులు అందరూ ఆనందంతో ఉండాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు.