ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం: మల్లాది విష్ణు

ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం: మల్లాది విష్ణు

AP: భగవద్గీతపై MS రాజు వ్యాఖ్యల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని YCP నేత మల్లాది విష్ణు విమర్శలు గుప్పించారు. రాజు TTD సభ్యుడిగా ఉంటూ ఇలా మాట్లాడటం సరికాదని, ప్రభుత్వం ఇలాంటివారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమలను రాజకీయ పునరావస కేంద్రంగా వాడుకుంటున్నారని, సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమైపోయారని ప్రశ్నించారు.