'మున్సిపాలిటీలో కార్మికుల వేతనాలు పెంచాలి'

SRD: నారాయణఖేడ్ మున్సిపాలిటీలో డ్రైవర్లు, వాటర్‌మెన్, ఆపరేటర్లకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. జీవో 60, 63 ప్రకారం ఇతర మున్సిపాలిటీలలో అమలవుతున్న వేతనాలు నారాయణఖేడ్‌లో కూడా అమలు చేయాలని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు.