స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పరిశీలించిన డీఎస్ఓ

KKD: కరప మండలంలోని 23 గ్రామాల్లో 35,552 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు డీఎస్ఓ సత్యనారాయణ రాజు తెలిపారు. మంగళవారం ఆయన రేషన్ కార్డుల పంపిణీని పరిశీలించారు. ఈ పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో రేషన్ షాపుల వద్ద వీఆర్వోలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.