19 నుండి మండలంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు

NLR: చేజర్ల మండలంలో ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఎస్టీ వారికి స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. 19న యనమదల, 20న నాగుల వెలుటూరు, 21న ఆదూరుపల్లి, 22న పెరుమాళ్ళ పాడు, 23న మాముడూరు, 24న చేజర్ల ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.