VIDEO: అర్ధరాత్రి దొంగతనం.. సీసీ ఫుటేజ్
MDCL: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్‌చల్ చేశారు. ఔషాపుర్‌లో దొంగలు అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.