వాడ్రాపల్లిలో మేలుకొలుపు కార్యక్రమం
AKP: ధనుర్మాసం ప్రారంభమైన నేపాధ్యంలో మునగపాక మండలం వాడ్రాపల్లిలో భక్తులు బుధవారం ఉదయం మేలుకొలుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పెదరామాలయంలో పూజలు నిర్వహించి సీతారామ చంద్రుల విగ్రహాలతో భజనలు చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ నగర సంకీర్తన చేశారు. నెలరోజుల పాటు మేలుకొలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని భక్తులు తెలిపారు.