ప్రయాణికుల విశ్రాంతి భవనం నిరుపయోగం

ప్రయాణికుల విశ్రాంతి భవనం నిరుపయోగం

SKLM: జి. సిగడాం మండల కేంద్రంలో ప్రయాణికుల కోసం నిర్మించిన విశ్రాంతి భవనం నిరుపయోగంగా మారింది. భవనం ఎదుట కిరాణా, కూరగాయల దుకాణాలు వెలిసి ఉండటంతో ప్రయాణికులు లోపలికి వెళ్ళేందుకు వీలులేకుండా పోయింది. ప్రభుత్వం లక్షలాది రూపాయల పెట్టుబడి వృధా అవుతుంది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.