ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్ల తొలగింపు

శ్రీ సత్యసాయి: కొత్తచెరువు మండల కేంద్రంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు కొత్తచెరువు ఎంపీడీవో సిద్ధారెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హర్షద్ వలి, సాయి ప్రసాద్లను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో తెలిపారు.