ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
NRML: కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలోని మూడవ అంగన్వాడి కేంద్రం పరిధిలో ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విమల, డాక్టర్ అజయ్ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అరగంటకోసారి నీటిని తీసుకోవాలన్నారు.