కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం

కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం

SRPT: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, ఈదురు గాలులతో కూలిన వర్షం మొదలైంది. దీంతో పలు మండలాల్లో జాతీయ రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.