20న మండల సర్వసభ్య సమావేశం

20న మండల సర్వసభ్య సమావేశం

CTR: పుంగనూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఈ నెల 20న మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు MPDO అప్పాజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు నివేదికలతో తప్పక హాజరు కావాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు.