'రణభేరి 3.0' నిరాహార దీక్షలు

'రణభేరి 3.0' నిరాహార దీక్షలు

W.G: ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ మంగళవారం 'రణభేరి 3.0' నిరాహార దీక్షలు జరిగాయి. పీఆర్సీ, ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని 20 మంది సభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఆకివీడు యూనియన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.