ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

HYD: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి బుధవారం హాజరయ్యారు. ఈ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించి ఆమె లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ విచారించింది. ఇప్పటికే మొత్తం 29 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది.