ఈ నెల 20 నుంచి మురమళ్ల వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కోనసీమ: మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21న వైశాఖ శుక్ల పంచమి పర్వదినాన బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా జరుగనుందని ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు.