'నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం'

ADB: నిర్మల్ జిల్లాలోని కుబీర్, కల్లూర్, ఐపీడీఎస్ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని భైంసా ఏడీఈ ఆదిత్య తెలిపారు. భైంసా శివారులో మిషన్ భగీరథ సమీపంలోని సబ్ స్టేషన్‌కు మరమ్మతుల కారణంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వెల్లడించారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.