వాగులు వంకల దగ్గరకు వెళ్ళకండి: సీఐ

వాగులు వంకల దగ్గరకు వెళ్ళకండి: సీఐ

HNK: ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి కోరారు. ప్రజలు సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. జాలర్లు, ప్రజలు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళవద్దని.. ఎటువంటి సహాయం కావాలన్నా డయల్ 100 కు ఫోన్ చేయాలని కోరారు.