విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
SDPT: చిన్నకోడూరు మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంఈవో తిరుపతి, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మయ్య అభినందించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.