రహదారుల పనులను పరిశీలించిన MD

GNTR: మంగళగిరి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ MD లక్ష్మీ పార్థసారథి, శుక్రవారం రాజధాని గ్రామాల్లో జరుగుతున్న రహదారుల పనులను పరిశీలించారు. కురగల్లు, నిడమర్రు, వుడా కాలనీలలో నిర్మిస్తున్న ఈ-13,14,15,16 రహదారుల పనులను తనిఖీ చేసి, అధికారులకు సూచనలు ఇచ్చారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.