ముత్యాలమ్మ తల్లి హుండీ ఆదాయం రూ.1.42.085
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగరం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి దేవస్థానం హుండీని బుధవారం గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో లెక్కించారు. రూ. 1,42,085 నగదు, 226 గ్రాముల వెండి, 2 గ్రాముల బంగారం దేవస్థానానికి ఆదాయంగా వచ్చినట్లు తెలిపారు. ఈ నగదును ఆలయ అభివృద్ధికి ఉపయోగించనున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.