రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
E.G: నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు బైక్‌పై త్రిబుల్ రైడ్ వెళ్తున్న క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.