14న సత్తెమ్మ తల్లి జాతర

14న సత్తెమ్మ తల్లి జాతర

VSP: సింహాద్రినాథుడి సోదరిగా భావించే పొలిమేర దేవత శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారి వార్షిక జాతర ఈనెల 14న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు వెంకట్రావు తెలిపారు. జాతర సందర్భంగా సారె ఊరేగింపు, అభిషేకాలు, పంచహారతి, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.