చిట్టిగూడూరు వద్ద కోళ్ల ఫారం వ్యాన్ బోల్తా
కృష్ణా: మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కోళ్ల ఫారం వ్యాన్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పక్కకు తీసేందుకు చర్యలు చేపట్టారు.