BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,970 పెరిగి రూ.1,51,480కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.1,800 పెరిగి రూ.1,38,850గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.2,65,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.