'బాల్య వివాహాలను నిర్మూలించాలి'
AKP: బాల్యవివాహాల నిర్మూలనకు అందరూ సహకరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. జనవరి 8 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులు అందరూ విజయవంతం చేయాలన్నారు. బాల్య వివాహ రహిత జిల్లాగా చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ప్రతిజ్ఞ చేయించాలన్నారు