వల్లూరులో సామాజిక తనిఖీ కార్యక్రమం
KDP: వల్లూరు మండలం ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం అడిషనల్ పీడీ రామలింగ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం మండలంలోని 15 పంచాయతీలలో ఉపాధి హామీ పనుల్లో ఏవైనా అవినీతి జరిగిందా అనే అంశాలపై ఆరా తీశారు. ఈ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. ఏపీడీ ఆజాద్, డీవీవో జుబేదా, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.